టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని, 7వ తేదీ శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి..దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి..వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపండన్నారు నారా లోకేష్. కాంతితో క్రాంతి పేరిట కార్యక్రమం నిర్వహిద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. బాబుతో నేను అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండని, వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లు, టార్చ్ లైట్లు.. వీటిలో వేటినైనా తీసుకుని వెలుగు చూపించండన్నారు నారా లోకేష్. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా.. అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలు. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటిని సూచిస్తోంది. ఆ చీకటిని తరిమికొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి. ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలను వెలిగిద్దాం.’ అని పోస్ట్ చేశారు.
Also Read : Bhagavanth Kesari Trailer Launch: వరంగల్ లో అరిస్తే… తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ రావాలే
అయితే ఇటీవల టీడీపీ శ్రేణులు మోత మోగిద్దాం పేరిట కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో పాటు చంద్రబాబు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమయంలో ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ అక్కడే నుంచి మోత మోగిద్దాంలో పాల్గొన్నారు. అయితే.. నారా బ్రాహ్మణి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి డప్పువాయించారు. అయితే.. గత 20 రోజల నుంచి ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ నిన్ననే ఏపీకి వచ్చారు. జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఈరోజు నారా లోకేష్ రాజమండ్రికి బయలు దేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : Leo: రీమేక్ సినిమా కాబట్టే జజ్ జనరేట్ అవ్వట్లేదా? లోకేష్ కూడా రీమేక్ అంటే ఎలా?