మాజీమంత్రి దాడి ఫ్యామిలీ వైసీపీకి గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలో.. దాడి వీరభద్రరావు రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. తాను, తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా.. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే.. దాడి వీరభద్రరావు ఫ్యామిలీ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. రేపు చంద్రబాబుతో దాడి వీరభద్రరావు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
Read Also: JN.1 Cases: దేశవ్యాప్తంగా 263 కోవిడ్ JN.1 కేసులు.. ఒక్కరాష్ట్రంలోనే సగం కేసులు..
ఇదిలాఉంటే.. దాడి వీరభద్రరావు 2014ముందు టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా.. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అనకాపల్లి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించారు దాడి వీరభద్రరావు. అయితే 2014 ముందు ఆయన వైసీపీలో చేరారు. గతంలో.. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ పోటీ చేశారు. కాగా.. 2019లో టిక్కెట్ లభించకపోవడంతో వైసీపీకి దూరంగా ఉంది దాడి ఫ్యామిలీ.
Read Also: Samyuktha Menon: పీకల్లోతు ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. సైలెంటుగా పెళ్లి?