పార్టీ నేతలతో టీడీపీ అధినేతచంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టిక్కెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని తెలిపారు. జగన్ తో విసిగిపోయిన చాలా మంది వైసీపీ నేతలు.. రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరుతాం అంటున్నారని చెప్పారు. మంచి వారై ఉండి, పార్టీకి బలోపేతానికి…
టీడీపీపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని విమర్శించారు. విధ్యంసం పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న మనసులో మాట పుస్తకాన్ని బయటపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు... వైసీపీ ఐదేళ్లపాలనకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు…
టీడీపీపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న హౌసింగ్ కాలనీ కోసం గతంలో చూసిన భూములు టీడీపీ కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయాయని ఆరోపించారు. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకూడదనే దురుద్దేశ్యంతో టీడీపీ నేతలు కావాలనే మళ్లీ మళ్లీ కోర్టుకు వేయించారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఒంగోలులో భూములు తీసుకున్నామని.. ఒంగోలులో పట్టాలు ఇవ్వకుంటే పోటీ కూడా చేయనని చెప్పానని బాలినేని తెలిపారు.
ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.