హెరిటేజ్ మీది కాదు.. మోహన్ బాబుది అని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అన్నారు. జైలులో ఉండి కూడా మా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని భువనేశ్వరి అంటున్నారు.. ఆరు నెలల్లో మోహన్ బాబు హెరిటేజ్ చంద్రబాబుకు వచ్చేసింది.. నార్కో టెస్ట్ పెడుతా మీకు నేను ప్రశ్నలు అడుగుతా అని ఆయన పేర్కొన్నారు.
ఇవాళ్టి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పర్యటించబోతున్నారు. ఈ రోజు నుంచి 23 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె పర్యటన కొనసాగుతుంది. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన జరుగనుంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీలోకి చేరికల హోరు కొనసాగుతుంది. తాజాగా.. కొందరు వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ విధానాలు నచ్చి అనేక మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు.