టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. గతంలో యువగళం పేరుతో తాడిపత్రికి వచ్చి తనపై నిరాధారమైన ఆరోపణలు చేశాడు లోకేష్.. మరలా లోకేష్ శంఖారావం పేరుతో తాడిపత్రికి వస్తున్నాడు అని ఆయన తెలిపారు.
ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి స్పీడ్ పెంచారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్యాన్ పార్టీకి గుడ్బై చెప్పి వరుసగా సైకిలెక్కుతున్నారు.
త్వరలో జరగబోవు ఎన్నికల సంగ్రామంలో తెలుగుదేశం జనసేన టీడీపీల కలయిక చారిత్మాత్మకమైనదని.. మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా నడిచి విజయం సాధిద్దామని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. వింజమూరు మండల కేంద్రం బొమ్మరాజు చెరువు తెలుగుదేశం కార్యాలయం నందు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో దుష్ట శక్తిని సాగనంపాలంటే అందరి కలయిక ముఖ్యమని ఒక అడుగు ముందుకేసి అనుభవం…
మేదరమెట్ల సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా లేదు అని దుయ్యబట్టారు. చంద్రబాబు.. 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటైన అమలు పరిచారా ? అని ప్రశ్నించారు. మళ్లీ పొత్తు పెట్టుకుని ఇంతకు మించి హామీలు ఇచ్చి మీ దగ్గరకు రావడానికి రెడీ అయ్యారని సీఎం జగన్ తెలిపారు. ప్రజలకు మంచి చేయక పోగా ప్రజలకు మంచి చేసిన జగన్ ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
మేదరమెట్ల వద్ద వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. త్వరలోనే మేనిఫేస్టో విడుదల చేస్తామని తెలిపారు. మేం చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం అన్నారు. చంద్రబాబు మేనిఫేస్టోకు.. శకుని చేతిలో పాచికలకు తేడా ఉందా..? అని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పే అబద్దాలకు హద్దే లేదని విమర్శించారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు.. అధికారం పోతుందన్న భయంలేదు.. హిస్టరీ బుక్ లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే తన కోరిక అని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల…
మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన 'సిద్ధం' సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. మేదరమెట్లలో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తోంది.. సభకు వచ్చిన ప్రజల్ని చూస్తుంటే మహాసముద్రాన్ని తలపిస్తోందని అన్నారు. నాపై నమ్మకంతో వచ్చిన అందరికీ ధన్యవాదాలు.. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దామని తెలిపారు. పేదవాడి భవిష్యత్ ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని అన్నారు. పార్టీల పొత్తులతో చంద్రబాబు.. ప్రజలే బలంగా మనం తలబడుతున్నామని చెప్పారు. పేదలను గెలిపించడమే తన లక్ష్యమన్నారు. జగన్ ను ఓడించాలని…