Bode Prasad : ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా.. ఈ పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరడంతో కూటమిగా మారింది. అయితే.. ఇటీవల కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా పార్టీల అధిష్టానాలు అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఇటీవల కాలంలో నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలను, ప్రజల్లో ఉంటున్న నాయకులకు టిక్కెట్లు ఇవ్వకుండా.. వారిని మరో చోట వాడుకుంటోంది అధిష్టానం.. దీనికి నిదర్శనం ఇటీవల అధికార వైసీపీ పార్టీ చేసిన నాయకులు ట్రాన్స్‌ఫరే చూసుకోవచ్చు.
Boora Narsaiah Goud: రాజీనామా చేస్తావా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బూర నర్సయ్య సవాల్
అయితే.. ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలో కీలకమైన నాయకులకు టిక్కెట్ ఇవ్వకుండా… కార్యకర్తల అభిమతం ఏంటో తెలుసుకోకుండానే పార్టీ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానికంగా ఉండి ప్రజలతో మమేకమైన నాయకులు పక్కన పెడుతున్నారు. అలాంటి పెనమలూరు నియోజకవర్గం. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ బోడె ప్రసాద్‌ను కాకుండా మరో వ్యక్తిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బోడె ప్రసాద్ కాకుండా.. మరో వ్యక్తి అయితే.. పెనమలూరు నియోజకవర్గానికి తగిన వారు కారని.. తగిన న్యాయం చేయలేరనేది అక్కడి కార్యకర్తలు, నేతల వాదన. గత నాలుగు సంవత్సరాలుగా క్లిష్టపరిస్థితుల్లో కూడా పార్టీని వీడకుండా.. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతున్న బోడె ప్రసాద్‌కే పెనమలూరు టీడీపీ టికెట్ కేటాయించాలని అక్కడి నేతలు అంటున్నారు. పెనమలూరు ప్రజల్లో బోడె ప్రసాద్ సేవలు మరొకరితో కావని.. ఇన్ని రోజులుగా బోడె ప్రసాద్ టీడీపీకి చేసిన సేవలు గుర్తించి ఆయనకే టికెట్ కేటాయించాలని కోరుతున్నారు.
CM Jagan : పేదరికానికి కులం ఉండదు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ఈబీసీ నేస్తం