Bode Prasad : ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా.. ఈ పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరడంతో కూటమిగా మారింది. అయితే.. ఇటీవల కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా పార్టీల అధిష్టానాలు అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఇటీవల కాలంలో నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలను, ప్రజల్లో ఉంటున్న నాయకులకు టిక్కెట్లు ఇవ్వకుండా.. వారిని మరో…
ఈ ఎన్నికల్లో.. టీడీపీ అధికారం చేపట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమని ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పేర్కొన్నారు.
జేఎస్పీ, బీజేపీలతో సీట్ల పంపకం ఒక కొలిక్కి రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జేఎస్పీ, బీజేపీలకు 31 సీట్లు కేటాయించారు. ఇప్పటికే టీడీపీ తొలి జాబితాలో 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో టీడీపీ 30 అసెంబ్లీ, కొన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. జేఎస్పీ, బీజేపీ రెండూ తాము పోటీ చేసే స్థానాలపై…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత మాచాని సోమనాథ్. మాచాని సోమప్ప ఎక్కడైతే అభివృద్ధిని వదిలేసారో.. వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తానని, చేనేత అభివృద్ధికి పాటుపడుతానని ఇటీవల చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో బుట్టా రేణుక చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.