టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తిక్కారెడ్డి.. చంద్రబాబు మంత్రాలయం టీడీపీ టికెట్ విషయంలో పునరాలోచించాలని సూచించారు. టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇక, చంద్రబాబు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బ్రోకర్లు ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు డబ్బులకు అమ్ముడు పోయి.. వైఎస్ జగన్ కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
విజయవాడలోని పెనమలూరు టీడీపీ సీటు పంచాయితీ సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు బుజ్జగింపు చర్యలు మొదలెట్టింది టీడీపీ అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు ఇంఛార్జి బోడే ప్రసాద్కు టికెట్ లేదని చెప్పేసింది అధిష్టానం. దీంతో.. నిన్నటి నుంచి బోడే వర్గం ఆందోళనకు దిగింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబును బోడే ప్రసాద్ కలవనున్నారు. సాయంత్రం నుంచి నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టే దిశగా ప్లాన్ చేస్తున్నారు బోడే ప్రసాద్.. అయితే..…
నేడు సీనియర్ రాజకీయ నేత, మాజీ రాష్ట్ర మంత్రి, కాపు ఉద్యమ నేతైన ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. నేటి ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షాన పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈయన గత…
నాకు టికెట్ ఇవ్వలేక పోతున్నట్టు చంద్రబాబు చెప్పమన్నారని నాకు సమాచారం ఇచ్చారని తెలిపిన బోడే ప్రసాద్.. కానీ, నేను ఏ తప్పు చేశాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. IVRS, సర్వేలు కూడా బాగున్నా టికెట్ ఇవ్వటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను ఓడిపోయిన సమయంలో కూడా ఇంత బాధపడలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.