Chandra Babu: బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో జరిపిన మాటలలో పలు వ్యాఖ్యలు చేసారు సీఎం చంద్రబాబు. ఎవరిపైనా రాజకీయంగా నిలదీసే స్వభావం లేదని, అలా చేసిన వారెవరూ తప్పించుకోలేరని, తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా తెలిపారు. గత ఐదేళ్లలో అందరికంటే ఎక్కువగా బాధపడ్డది నేనేనని.. గత ప్రభుత్వం నన్ను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారని., జైలులో నన్ను చంపేందుకు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇప్పటికే రాజీనామా చేసిన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు టీడీపీ గూటికి చేరనున్నారు.. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇక, ఈ ఇద్దరు మాజీ ఎంపీల వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా టీడీపీ కండువాకప్పుకుంటారని తెలుస్తోంది..
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవిని జనసేనకు.. వైస్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు.. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మూడు చోట్ల పోటీ చేస్తే మూడు చోట్ల విజయం సాధించగా.. టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట మాత్రమే గెలిచారు.. ఇదే ఇప్పుడు చర్చగా మారింది..
CM Chandrababu: మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి మానవత్వం చాటుకున్నారు. తమ నాయకుడితో ఫోటో దిగాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చారు చంద్రబాబు. అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్య ఖర్చులకు ఐదు లక్షల ఆర్థిక సాయం కూడా ఆయన అందించారు.
Tiruvuru: తిరువూరు టీడీపీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు తీరుతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేకు చెక్ పెట్టే విధంగా అధిష్ఠానం నిర్ణయం ఉంటుందంటున్న పార్టీ వర్గాలు.. గడిచిన 100 రోజుల్లోనే పార్టీకి తలనొప్పిగా ఎమ్మెల్యే వ్యవహార శైలి మారింది.
Satya Prasad: అధికారం లేక పిచ్చి పట్టినట్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు.. అందుకే అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం.. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడగలిగాలి.. అప్పుడే ప్రజల ఆశీస్సుల ఉంటాయి.
BC Janardhan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలులో సంస్థాపరంగా వచ్చే సమస్యలు ఎదుర్కొనే తీరుని పరిశీలించేందుకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అస్సాంలో పర్యటించనుంది.
YS Jagan: తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.