Satya Prasad: అధికారం లేక పిచ్చి పట్టినట్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు.. అందుకే అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం.. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడగలిగాలి.. అప్పుడే ప్రజల ఆశీస్సుల ఉంటాయి.
BC Janardhan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలులో సంస్థాపరంగా వచ్చే సమస్యలు ఎదుర్కొనే తీరుని పరిశీలించేందుకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అస్సాంలో పర్యటించనుంది.
YS Jagan: తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
గవర్నర్ ను కలిసే యోచనలో ఉన్నారు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ.. నెలరోజుల కిందట వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పద్మ శ్రీ.. అయితే, ఇప్పటి వరకు ఆమె రాజీనామాకు ఆమోదముద్రపడలేదు.. తన రాజీనామాపై మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లే ఆలోచనలో ఆమె ఉన్నారట..
పోటీకి వైసీపీ దూరం.. పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ..! గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భారీ విజయాన్ని అందుకున్నారు.. ఇక, జనసేన ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తుండగా.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అయితే, ఇప్పుడు పిఠాపురంలో జరుగుతోన్న ఓ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండగా..…
రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదన్న ఆమె.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి..
ప.గో జిల్లా పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ, నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలకొల్లు పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతన రక్షిత మంచినీటి విభాగం పనితీరును మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. రామగుండం పార్కు, ఎన్టీఆర్ కళాక్షేత్రం, ఎన్టీఆర్ టిడ్కో గృహాలను పరిశీలించారు.
Velampalli Srinivas: ఏపీ సీఎం చంద్రబాబు వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అందుకే లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. ఆధారాల్లేకుండా అడ్డమైన ఆరోపణలు చేశారు.. తప్పు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేయలేదు? అని ప్రశ్నించారు. కంటితుడుపు కోసం ఇప్పుడు సిట్ వేశారు.
అక్కడ టీడీపీ వర్సెస్ టీడీపీగా యుద్ధం నడుస్తోందా? పార్టీ సీనియర్ లీడర్ ఏకంగా మంత్రి మీదే ఎర్రచందనం, మట్టి మాఫియా ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వ కార్యక్రమం వేదికగా రోజుకో నాయకుడి మీద పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న ఆ టీడీపీ సీనియర్ ఎవరు? ఎక్కడ జరుగుతోందా తన్నులాట?