మూడేళ్ల వైసీపీ పరిపాలనలో రాయలసీమ రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుందన్నారు. రాయలసీమలో పర్యటించకపోయిన ఫర్లేదు…. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ప్రజా తీర్పు…వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా వుంటుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యం,క్రీడల పై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి…
విజయనగరం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పై మండిపడ్డారు. బొత్సా వ్యాఖ్యల మీద స్పందిస్తే నా మీద ఎంపీ బెల్లాన స్పందించారు. ఆర్.ఈ.సి.ఎస్ లో అవినీతి జరిగిందని ఎంపీ బహిరంగంగా ఆరోపించారు. మరుసటి రోజు విజయవాడ వెళ్లి వచ్చిన తరవాత తమ వ్యాఖ్యల్లో మార్పు కనపడింది. వైసీపీ మూడేళ్లలో ఉత్తరాంధ్రకు బొత్సా చేసిన అభివృద్ధి ఏంటి. తన పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టారు. మాజీమంత్రి…
నర్సీపట్నంలో వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చేందుకు తీసుకుని వచ్చిన జేసీబీ అద్దాలు ధ్వంసం చేశారు. అనకాపల్లి నుంచి వస్తున్న జేసీబీని దుంగనవానిపాలెం దగ్గర అడ్డుకుని గాలి తీసేసి నిరసన తెలిపారు. అయ్యన్న ఇంటి దగ్గరే మకాం వేసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అధికారులను అడ్డుకుంటున్నారు. నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత…
అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుండి వచ్చారు? టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు. పార్టీని, బ్యాంకు బ్యాలెన్స్ కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు తరహాలోనే అయ్యన్నపాత్రుడు నడుస్తున్నారు.మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటి? బీసీలు సెక్రటేరియట్ కి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు, అలాంటి…
ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉచిత పంటల బీమా పథకం రాష్ట్రంలో నవ్వులాటగా మారింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 98 శాతం కట్టగా 2 శాతం మాత్రమే రైతు కట్టే ఈ పథకాన్ని అటకెక్కించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ (పంటల బీమా) రైట్ యాక్టు లేకుండా చేసింది. రైతుల హక్కులను జగన్ ప్రభుత్వం కాల రాసింది. 2020నుంచి కూడా…