తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడుతోంది. టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు అనితపై మంత్రి రోజా, వెంకట్రావు మాట్లాడిన తీరును టీడీపీ తీవ్రంగా విమర్శించింది. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితను దుర్భాషలాడిన వైసీపీ నేతలపై ఫిర్యాదు చేస్తాం అంటున్నారు తెలుగు మహిళలు. డీజీపీ కార్యాలయానికి వెళ్తోన్న తెలుగు మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. డీజీపీ కార్యాలయం సమీపంలో తెలుగు మహిళలని అడ్డుకున్న పోలీసులు వారిని నిలువరించారు. ఇద్దర్ని మాత్రమే లోపలకు పంపిస్తామన్నారు పోలీసులు.
ఐదుగురం వెళ్తామని పట్టుపడుతున్నారు తెలుగు మహిళలు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, వైసీపీ మహిళా నేత రోజారాణి పై డీజీపీ కార్యాలయంలో తెలుగు మహిళల ఫిర్యాదు చేశారు. అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అనితకు వైసీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మహిళల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకే ప్రభుత్వం భయపడుతోంది. మహిళల్ని అవమానించటమే ఈ ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది. పోలీసు బెదిరింపులకు మేం భయపడం అన్నారు తెలుగు మహిళలు. వైసీపీ నేతల తీరు ఇలానే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతాం అని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ పాలన తీరును అనిత ప్రశ్నిస్తున్నందునే ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ ఇటువంటి దిగుజారుడు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు.
Khuda Haafiz-2: వివాదంలో బాలీవుడ్ సినిమా.. వీడియో సాంగ్ డిలీట్ చేయాలని డిమాండ్