సత్యవేడు పేరు వింటేనే... టీడీపీలో షేకవుతోందట. ఈ నియోజకవర్గంలోని వ్యవహారాలను చూసి... జిల్లా నేతలతో పాటు... పార్టీ పెద్దలు సైతం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలంకు పార్టీ టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. ఇష్టం లేకపోయినా.... అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నేతలంతా కలిసి ఆయన్ని గెలిపించుకున్నారు.