తెలుగుదేశం పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై సమీక్ష జరిపారు. ముందస్తు ఎన్నికల ప్రస్తావనపై చర్చించారు చంద్రబాబు. ముందస్తు ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని సీఎం జగన్‌కూ అర్థమవుతోంది. జగన్ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా బూటకమేనని ప్రజలకూ…
మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలతో గుంటూరు జిల్లా వణుకుతోంది. గుంటూరు జిల్లాలో వరుసగా కొనసాగుతున్న మహిళలపై లైంగిక దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్16న గురజాల రైల్వేస్టేషన్ లో ఒడిషాకు చెందిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. 27న కొల్లూరు మండలం చిలుమూరులో రూపశ్రీ అనే మహిళను పొలంలోనే హత్య చేశాడు ప్రవీణ్ అనే దుండగుడు. 28న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత తిరుపతమ్మ హత్యకు గురయింది. కోరిక తీర్చలేదని గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. 29న…
ఏపీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఈనెల 27న బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేత బోండా ఉమ చెప్పారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద ఇటీవల మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నానాయాగీ చేశారని.. చంద్రబాబు వస్తున్నారని తెలిసి మేకప్ వేసుకుని వచ్చారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. మహిళా కమిషన్‌కు లేని పవర్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పెన్ను, పేపర్ ఉందని నోటీసులు ఇచ్చి.. ఎలా రారో చూస్తామంటూ ఛాలెంజ్‌లు చేస్తున్నారని…
నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సిద్ధమయ్యాయి. ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణకు తెలంగాణలో నేటితో గడువు ముగియనుంది. క్రమబద్ధీకరణ కోసం ఇప్పటివరకు 1.47 లక్షల దరఖాస్తులు వచ్చాయి. శ్రీశైలంలో రెండోరోజు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. కైలాసవాహనంపై ఆశీనులై ఆది దంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు. నేడు భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రానున్నారు. ప్రస్తుత…
ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతూనే వున్నారు. అసెంబ్లీ జగన్ భజన సభలా మారింది. సభలో మాట్లాడకుండా మా గొంతు నొక్కారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప. కల్తీ సారా,నకీలీ మద్యంపై సభలో చర్చించాలని ఆందోళన చేశాం. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలు చెప్పారు. ఇకనుంచి ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తాం. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే…
ఏపీలో ఓటీఎస్‌ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. టీడీపీ మాత్రం అది పేద ప్రజల రక్తం పీల్చే పథకం అంటోంది. ఓటీఎస్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటానికి అభినందనలు తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని…
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఓ చర్చలో భాగంగా వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఏపీలోని పలుచోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అనంతపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఈ మేరకు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. అసెంబ్లీ సమావేశాలు…
ఏపీలో రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి. మంగళవారం ఏపీలోని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ నేతలు ధర్నాలకు పిలుపునిచ్చారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ ధర్నాలపై హాట్ కామెంట్స్ చేశారు. పెట్రోల్ డీజిల్ రేట్లు అంశంలో చంద్రబాబు ధర్నా ఏపీ లో కాదు…జంతర్ మంతర్ దగ్గర చేయాలన్నారు. దమ్ముంటే బీజేపీ పై ధర్నా చేయాలన్నారు కారుమూరి. తన స్వంత నియోజకవర్గం కుప్పం…