ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసనలు తెలుపుతూనే వున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా వున్నాయి. మోటార్లకు కు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ ఛలో రెడ్డిపల్లి కార్యక్రమానికి టీడీపీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీతను అడ్డుకున్నారు పోలీసులు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పుడున్న పోలీస్ అధికారులు ఎమ్మెల్యేలకు భజన చేస్తూ టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు.
2024లో అధికారంలోకి వచ్చేది మేమే. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు ఎవరైతే అధికారులు ఎమ్మెల్యేలు చెప్పుడు మాటలు విని మీ సర్వీసు తగ్గించుకో కూడదని పోలీస్ అధికారులకు సూచించారు. ఏ రాజకీయ నాయకుడైనా ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటారన్నారు పరిటాల సునీత. టీడీపీ కార్యాలయం నుంచి గొందిరెడ్డిపల్లికి బయలుదేరిన మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ కార్యాలయం వద్ద నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు.
Shivshankar Wife Protest: నిత్య పెళ్ళికొడుకు సొంతూళ్ళో భార్య ఝాన్సీ నిరసన
పరిటాల సునీతను అడ్డుకున్న విషయం తెలుసుకొని భారీ సంఖ్యలో రాప్తాడుకు చేరుకున్నారు టీడీపీ అభిమానులు. పోలీసుల తీరుపై పరిటాల సునీత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలానే వ్యవహరించారు పోలీసులు. ఇప్పటికే సిపిఐ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు పోలీసులు. స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు బిగించిన మీటర్లను పీకి పడేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు సునీత. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు దద్దమ్మలా తయారయ్యారని సునీత విమర్శించారు.
రూ. 2 వేలలోపు లభ్యమయ్యే స్మార్ట్ వాచెస్