Botsa Satyanarayana: రాజ్యాంగం ప్రకారం సభను, ప్రభుత్వాన్ని నడపాలి.. సభ్యులను గౌరవించాలి.. సభాపతికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.. మండలి చైర్మన్ మోషేన్ రాజుకు జరిగిన అవమానంపై వైసీపీ నిరసన చేపట్టింది.. నల్లకండువాలు ధరించి మండలికి హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్సీలు.. సభాపతికి ప్రోటోకాల్ పాటించారా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.. సీఎం క్షమాపణ చెప్పాలంటూ మండలిలో కోరారు వైసీపీ సభ్యులు.. ఇవాళ ఇదే అంశంపై మండలిలో కొనసాుతున్నాయి వైసీపీ…
ప్రజాప్రతినిధులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని స్పష్టం చేసిన ఆయన.. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారని తెలిపారు.. అయితే, చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా.. సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించారు.