ఏపీలో వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ద్వారంపూడిలపై మండిపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. మంత్రి కొడాలి నాని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిలు కలిసి పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతూ భారీ అవినీతికి పాల్పడుతున్నారు. గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని దోచుకుని కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టుకు తరలిస్తున్నారు. రేషన్ దుకాణాల వ్యవస్థను నిర్వీర్యం చేసి బియ్యాన్ని కొడాలి నాని, ద్వారంపూడిలు పక్కదారి పట్టిస్తూ పందికొక్కుల్లా తింటున్నారు.
ఏటా రూ.5 వేల కోట్ల విలువైన పేదల బియ్యాన్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు పట్టాభి. దొంగ బియ్యం వ్యాపారంలో మంత్రి కొడాలి నానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి భాగస్వామి.బియ్యం అక్రమ రవాణాపైనే ద్వారంపూడి కుటుంబం బతికేస్తోంది.కాకినాడ పోర్టు నుంచి టీడీపీ హయాంలో నాన్ బాస్మతీ రకం 18 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయ్యిందన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో 31లక్షల టన్నుల పైబడి బియ్యం ఎగుమతి అవుతోంది.కొడాలినాని ద్వారంపూడితో కలిసి రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతున్నందుకే దేశంలో మరే పోర్టు నుంచి పెరగనంతగా కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు జరిగాయి.అక్రమంగా ఎగుమతి చేసిన బియ్యాన్ని వెస్ట్ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టుకు తరలిస్తున్నారని విమర్శించారు పట్టాభి .