Adimulapu Suresh: దమ్ముంటే.. ఆ వీడియో మాధవ్‌దేనని నిరూపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh Responds On Goratala Madhav Video Call Issue: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం స్పందించారు. మాధవ్‌కు చెందినదిగా చెబుతున్న ఆ వీడియో మార్ఫింగ్ చేసినదేనని ఆయన వెల్లడించారు. మాధవ్‌పై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని.. దమ్ముంటే ఆ వీడియో మాధవ్‌దేనని నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. వీడియో వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి… దానిని సృష్టించిన ఐ-టీడీపీకి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదిమూలపు సురేశ్ డిమాండ్ చేశారు. దోషులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీకి, సీఎం జగన్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి.. టీడీపీ నాయకులకు దిక్కతోచడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తున్నా.. టీడీపీ నేతలకు బుద్ది రావటం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. గోరంట్ల మాధన్ న్యూడ్ వీడియో కాల్ ఎపిసోడులో, అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పించిన నివేదికను టీడీపీ విడుదల చేసింది. ఈనెల 9న ఆ వీడియోని పంపించామని.. నిన్న నివేదిక వచ్చిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఎంపీపై చర్యలు తీసుకోకుండా సీఎం జగన్ వెనకేసుకొస్తున్నారని.. ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే మార్ఫింగ్ అని ఎలా తేలుస్తారని ఆయన ప్రశ్నించారు. వీడియో ఎడిటింగ్ చేసింది కాదని ఎక్లిప్స్ ల్యాబ్స్ తేల్చిందన్నారు. ఈ నివేదిక ఆధారంగా మాధవ్‌తో రాజీనామా చేయించి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత సైతం మాధవ్‌పై మండిపడ్డారు. గలీజు వ్యవహారాన్ని కులానికి ఆపాదించడం నిజంగా సిగ్గుచేటని.. ప్రభుత్వం సహా పోలీసులు సైతం మాధవ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ నివేదికపై చర్చించే దమ్ము పోలీసులకు, ప్రభుత్వానికి ఉందా? అంటూ సవాల్ విసిరారు.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!