గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన చంద్రయ్య అనే వ్యక్తిపై నిన్న రాత్రి కత్తులతో, కర్రలతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యచేశారు. ఈ నేపథ్యంలో చంద్రయ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. హత్యా రాజకీయాల వారసుడు జగన్ సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందిని ఆయన ఆరోపించారు.…
మాచర్ల టీడీపీ ఇంచార్జీ జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్యను నిన్న రాత్రి కొందరు దుండగులు కత్తులతో, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులోని చంద్రయ్య ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు యత్నించారు. అయితే బ్రహ్మరెడ్డి వచ్చేవరకు చంద్రయ్య మృతదేహాన్ని తరలించవద్దని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ చంద్రయ్య కుటుంబ…