ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన ఐకానిక్ మోడల్ సియారాను మరలా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 1991లో విడుదలైన సియారాను 2003లో నిలిపివేశారు. 20 ఏళ్ల తర్వాత సరికొత్త హంగులతో కొత్త సియారాను కంపెనీ మళ్లీ తీసుకొచ్చింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఇక 2026 జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. టాటా సియారా ఇప్పటికే క్రేజీ కారుగా నిలిచింది. లుక్స్,…
Tata Sierra Price: టాటా సియెర్రా (Tata Sierra) గురించి కార్ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో టాటా మోటార్స్ ఇప్పటికే, కార్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఆకర్షణీయమైన ధర, ఇతర కార్ మేకర్స్ ఛాలెంజ్ విసురుతోంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీగా వస్తున్న సియెర్రా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి విక్టోరిస్‌కు పోటీగా ఉండబోతోంది. ప్రస్తుతం, సియెర్రా బేస్ మోడల్ ధరను రూ. 11.49 లక్షలు(ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. ఈ…
Tata Sierra 7-Seater: టాటా మోటార్స్(Tata Motors) తన కొత్త సియెర్రా (Sierra) SUVతో సంచలనాలు క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. కొత్త బాక్సీ డిజైన్‌తో అట్రాక్ట్ చేస్తోంది. డీజిల్, పెట్రోల్ వేరియంట్లతో పాటు ఈవీ వేరియంట్‌లో కూడా సియెర్రా రాబోతోంది. ఇప్పటికే రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూం) ధరతో బేస్ వేరియంట్‌ను అందిస్తోంది. అగ్రేసివ్ ధరతో వస్తుండటంతో ప్రత్యర్థి కార్ మేకర్స్ కూడా హైరానా పడుతున్నాయి. 5-సీటర్‌గా వస్తున్న ఈ సియోర్రాలో అత్యాధుని ఫీచర్లతో పాటు హై…
Tata Sierra SUV: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నుంచి త్వరలో విడుదల కానున్న సియెరా (Sierra) ఎస్‌యూవీ గురించి ఆసక్తిని పెంచుతూ వరుస టీజర్‌లను విడుదల చేస్తోంది. నవంబర్ 25న లాంచ్‌కు ముందే కంపెనీ ఇప్పటికే ఈ కారు ఔటర్ లుక్, సన్‌రూఫ్, కాస్త ఇంటీరియర్ వివరాలను వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన టీజర్ వీడియోలో టాటా సియెరా డాష్‌బోర్డ్‌పై ఉన్న మూడు స్క్రీన్ లేఅవుట్ (Triple-Screen Layout)ను హైలైట్ చేసింది. ఇది ప్రస్తుతం టాటా…
Tata Sierra: భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఓ మంచి కార్యాన్ని తలపెట్టింది. ప్రపంచ కప్ గెలిచిన జట్టులోని ప్రతి సభ్యురాలికి త్వరలో విడుదల కానున్న సరికొత్త టాటా సియెరా (Tata Sierra) ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు.. వారి అద్భుతమైన ధైర్యసాహసాలు, అంకితభావం, దేశానికి గర్వకారణం తెచ్చిన స్ఫూర్తికి నిజమైన గౌరవమని టాటా మోటార్స్ పేర్కొంది.…
Tata Sierra: టాటా మోటార్స్(Tata Motors) సియెర్రా SUVని తీసుకురాబోతోంది. నవంబర్ 25న ఈ కార్ని లాంచ్ చేయబోతున్నారు. సియోర్రా టీజర్‌ను టాటా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్స్‌తో పాటు ఇంటీరియర్‌ను పరిచయం చేసింది. టాటా మోటార్స్ గత వాహనాలతో పోలిస్తే సియెర్రా మరింత స్టైలిష్ లుక్స్‌తో వస్తోంది. ఇంటీరియర్, డాష్‌బోర్డులు కొత్తగా కనిపిస్తున్నాయి. 3-స్రీన్ లేవుట్ స్పష్టంగా కనిపిస్తోంది. సర్రూఫ్తో స్టైలిష్ లుక్స్ కలిగి ఉంది.
భారతీయ SUV మార్కెట్‌లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఈ వాహన విభాగాన్ని దృష్టిలో ఉంచుకొని, వాహన తయారీదారులు కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో, టాటా మోటార్స్ త్వరలో టాటా సియెర్రా SUVని భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.