Tata Sierra Rivals: టాటా సియారాకు గట్టి పోటీ.. మారుతి, కియా, రెనాల్ట్ నుంచి టాప్ ఎస్‌యూవీలు!
- మరలా మార్కెట్‌లోకి టాటా ఐకానిక్ మోడల్ సియారా
- 20 ఏళ్ల తర్వాత సరికొత్త హంగులతో సియారా
- టాటా సియారాకు గట్టి పోటీ తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన ఐకానిక్ మోడల్ సియారాను మరలా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 1991లో విడుదలైన సియారాను 2003లో నిలిపివేశారు. 20 ఏళ్ల తర్వాత సరికొత్త హంగులతో కొత్త సియారాను కంపెనీ మళ్లీ తీసుకొచ్చింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఇక 2026 జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. టాటా సియారా ఇప్పటికే క్రేజీ కారుగా నిలిచింది. లుక్స్, డిజైన్ పరంగా అద్భుతంగా ఉండడంతో సియారాను కొనేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. అయితే సియారాకు పోటీ ఇవ్వడానికి ప్రముఖ కంపెనీల నుంచి టాప్ ఎస్‌యూవీలు విడుదల అవుతున్నాయి.
మారుతి ఇ విటారా:
ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెండు కార్లు త్వరలో విడుదల కానున్నాయి. మారుతి ఇ విటారా, కొత్త కియా సెల్టోస్, న్యూ ఎడిషన్ రెనాల్ట్ డస్టర్ విడుదలకు సిద్దమవుతున్నాయి. మారుతి ఇ విటారా ఈరోజు లాంచ్ అయింది. ఇది 5-సీట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇందులో 49kWh, 61kWh బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. డ్యూయల్ మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ ఉంటుంది. ఈ కారు 500 కిమీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది.
Also Read
- Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
- Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
- MG Hector Tomahawk EV: 7 సీటర్ SUV సెగ్మెంట్‌లో గేమ్‌ఛేంజర్..! మహీంద్రా XEVకి పోటీగా కొత్త EV..
- కొత్త కలర్స్, TFT డిస్‌ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
కియా సెల్టోస్:
కియా సెల్టోస్ డిసెంబర్ 10న విడుదల కానుంది. ఇది కొత్త డిజైన్, మరింత ప్రీమియం ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. అధికారిక టీజర్‌లో కొత్త హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, సవరించిన ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కొత్త సెల్టోస్ ప్రస్తుత మోడల్ కంటే పొడవు, వెడల్పుగా ఉంటుంది. ఇందులో ఎక్కువ క్యాబిన్ ప్లేస్ ఉంటుంది. పనోరమిక్ సన్‌రూఫ్, కొత్త సీట్ అప్హోల్స్టరీ, ట్రిమ్‌లు, రీడిజైన్ చేయబడిన డాష్‌బోర్డ్ అండ్ కంట్రోల్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రెనాల్ట్ డస్టర్:
మూడవ తరం రెనాల్ట్ డస్టర్ జనవరి 26న భారతదేశంలో లాంచ్ కానుంది. దీని డిజైన్, స్టైలింగ్ మునుపటి కంటే ఆధునికమైనవి. కొత్త గ్రిల్, రెనాల్ట్ సిగ్నేచర్ లోగో, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, Y-ఆకారపు LED DRLలు, కొత్త అల్లాయ్ వీల్స్, C-పిల్లర్‌పై వెనుక డోర్ హ్యాండిల్స్ సహా Y-ఆకారపు టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. రెనాల్ట్ డస్టర్ పెట్రోల్ ఇంజిన్‌లతో మాత్రమే వస్తుంది. బహుశా 1.0-లీటర్ టర్బో మరియు 1.3-లీటర్ టర్బో ఇంజిన్‌తో రానుంది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?