భారతదేశంపై ట్రంప్ సుంకాలు విధించడాన్ని అమెరికా అగ్ర ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. అమెరికా విదేశాంగ విధానంలో అత్యంత తెలివి తక్కువ చర్యగా పేర్కొన్నారు. భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించడం ఏ మాత్రం భావ్యం కాదన్నారు. ట్రంప్ పారిపాలన చర్యను ఖండించారు. ఇది విధ్వంసకర పరిణామం అన్నారు. ఆసియాలో భారతదేశం అతి ముఖ్యమైన భాగస్వామ్య దేశమని.. తాజా పరిణామం వాషింగ్టన్‌తో సంబంధాన్ని దెబ్బతీస్తుందన్నారు. సుంకాలు కారణంగా మంచి విశ్వాసాన్ని కోల్పోయినట్లైందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: చంద్రబాబు, నితీష్‌కుమార్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే బిల్లు.. తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు
భారతదేశంపై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆసియాలోని భారత్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం 50 శాతం సుంకం విధించారు. అయినా కూడా రైతుల కోసం భరిస్తామని ప్రధాని మోడీ అన్నారు. తమకు అన్నదాతలే ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అయితే రష్యాను కంట్రోల్‌లోకి తెచ్చేందుకే భారత్‌పై భారీగా సుంకాలు విధించినట్లు వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన