(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు) నేడు నటునిగా తనదైన బాణీ పలికిస్తూ అందరినీ అలరిస్తోన్న తనికెళ్ళ భరణి కలం బలం తెలియాలంటే ఓ మూడు దశాబ్దాలు పైగా వెనక్కి వెళ్ళాలి. జనబాహుళ్యంలో ఉన్న పదాలతో పసందైన సంభాషణలు రాసి ఆకట్టుకున్నారు భరణి. ఇక నటనలో అడుగు పెట్టాక, తనకు లభించిన ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనే తపించారు. ఇప్పటికీ ఆ తపనతోనే సాగుతున్నారాయన. అందుకే భరణి అభినయం జనానికి మొహం మొత్తలేదు. ఆయన కామెడీ…
అలనాటి నటి, మీర్జాపురం రాజా సతీమణి శ్రీమతి కృష్ణవేణికి తను రాసిన ‘ఆటగదరా శివ’ పుస్తకాన్ని అందజేశారు నటుడు తనికెళ్ళ భరణి. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారు ఘటసాల శతజయంతి స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని కృష్ణవేణికి అందజేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భరణి. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్రసీమలో కృష్ణవేణి పాత్ర మరచిపోలేననిదని చెప్పారాయన. అంతే కాదు తను రాసిన ‘ఆటగదరా శివ’లోని పద్యాలను పాడి వినిపించారు.
ఘంటసాల శతజయంతి అంతర్జాతీయ ఉత్సవాలలో భాగంగా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారు ఆదివారం ఉదయం అలనాటి నటి కృష్ణవేణిని ఘనంగా సన్మానించారు. అంతే కాదు ఘంటసాల శతజయంతి స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి నిర్మించిన ‘మనదేశం’, ‘కీలుగుర్రం’ చిత్రాలలో కృష్ణవేణి పాడిన పాటలను పాడి వినిపించటం విశేషం. ఈ కార్యక్రమంలో నటుడు, రచయిత తణికెళ్ల భరణి కూడా పాల్గొన్నారు.
‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు. ఎన్ని కథలు, కవితలు పొంగిపొరలినా, వాటికి నటన కూడా తోడయినప్పుడే రక్తి కడుతుందని పెద్దల మాట! ఇప్పటికీ నాటకం దేశవిదేశాల్లో సందడి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగునాట సైతం నాటకాన్ని బతికించే ప్రయత్నంలో కొందరు సాగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ‘సి.ఆర్.సి. కాటన్ కళాపరిషత్’ నాటకానికి వైభవం తీసుకువచ్చే దిశగా పయనిస్తోంది. ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి ఈ సంస్థకు గౌరవాధ్యక్షులు. విక్టరీ వెంకటరెడ్డి ఈ సంస్థ కన్వీనర్.…
టాలీవుడ్ లో నటుడిగా, రచయితగా తనికెళ్ళ భరణి సుపరిచితుడే. ఇక ఆయన శివుడిపై రాసే కవితలకు ఫ్యాన్స్ మాములుగా ఉండరు. అయితే చిత్ర పరిశ్రమలో ఉంటున్నామంటే ఎన్ని పురస్కారాలు ఉంటాయో.. అన్ని తిరస్కారాలు కూడా ఉంటాయి. ఎంతమంది మెచ్చేవాళ్ళు ఉంటారో అంతేముంది తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. తాజగా ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తనను తిట్టడం కాదు.. చంపేస్తామని బెదిరించారని కూడా చెప్పుకొచ్చారు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఊహ హీరోయిన్ గా ఆమె సినిమా తెరకెక్కిన సంగతి…
ప్రముఖ నటుడు, రచయిత, సాహితీ వేత్త తనికెళ్ళ భరణికి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ప్రకటించింది. జనవరి 18న ఎన్టీఆర్, హరివంశరాయ్ బచ్చన్ వర్థంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని అయనకు అందచేయనున్నారు. ఈ మేరకు లోక్ నాయక్ ఫౌండేషన్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. సోమవారం ఆంధ్రాయూనివర్శిటీలో మీడియాకు తెలియచేశారాయన. ఇప్పటి వరకూ ఈ పురస్కారం కింద లక్షరూపాయల నగదుని బహుమతిగా అందచేసి సత్కరిస్తూ వచ్చారు.…
యార్లగడ్డ వెంకట రమణ నిర్మాణ సారధ్యంలో సాయిరాం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఆవిర్భావ సభ పూజాకార్యక్రమాలతో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”సాయిరాం ప్రొడక్షన్స్ ఇవాళ ఆవిర్భవించింది. ఒక మంచి రోజున ఈ నిర్మాణ సంస్థ మొదలవడం ఆనందంగా ఉంది. నిర్మాత పద్మారెడ్డి చాలా ఏళ్లుగా తెలుసు. ఆయన సినిమా ఇండస్ట్రీ లో ముప్పై ఏళ్లుగా ఉన్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి గారితో ఆయన…
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి…