నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రామనాథపురం,తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-శ్రీలంక విమాన సర్వీలు రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా…
Holiday declared for schools in Tamil Nadu due to Heavy Rains: తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. నాగపట్నంలో అయితే ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుండి జనవరి 8 ఉదయం 5.30 గంటల వరకు 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరైకల్ (12.2 సెం.మీ.), పుదుచ్చేరి (9.6 సెం.మీ.), కడలూరు…
Tamil Nadu Floods: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. వర్షాలు తగ్గినప్పటికీ, ప్రజల్ని కష్టాలు వీడటం లేదు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు గత వారం కురిసిన వర్షాలకు చాలా ప్రభావితమైంది. తూత్తుకూడి ప్రాంతం దారుణంగా దెబ్బతింది. వరదల ధాటికి కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి.
Heavy Rain Hits Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి మరియు కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయంగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూత్తుకుడి జిల్లాలోని…
Tamil Nadu Rains.. floods in chennai: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవితం స్తంభిస్తోంది. ముఖ్యంగా రాజధాని చెన్నైలో శుక్రవారం రోజు భారీగా వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వరద గుప్పిట చెన్నై ఉంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Tamil Nadu Rains: తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై నగరంతో పాటు పలు జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది. పలు చోట్ల సబ్ వేలను మూసేశారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా చెన్నై, పుదుచ్చేరిలో సెలవులు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. పుదుచ్చేరిలో రెండు రోజుల పాటు స్కూళ్లు,…
Tamil Nadu Witnesses Heavy Rain: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవితం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా చెన్నై మహానగరం వరద గుప్పిట చిక్కుకుంది. చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని చాలా ప్రాంతాలు వరద నీరు చేరింది. సిటీలోని నుంగంబాక్కంలో నిన్న ఒకే రోజు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో పాటు సబర్బన్ రెడ్ హిల్స్ 13 సెంటీమీటర్లు,…