MK Stalin: జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా, హిందీ భాష విధింపుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఈ వివాదమే 20 ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసేందుకు సాయపడింది.
MK Stalin: తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘‘హంతకుడు కూడా ఇంత ఘోరంగా దాడి చేయడు. పోలీసులు అధికార మత్తులో ఉన్నారు. రాష్ట్రమే తన సొంత పౌరుడిని చంపింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పొలిటికల్ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్‌పై విరుచుకుపడుతున్నారు. స్టాలిన్ రాజీనామా…
Tamilnadu: 27 ఏళ్ల ఆలయ గార్డు కస్టడీలో మరణించిన ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలకు కారణమయ్యాయి. ఇదిలా ఉంటే, కస్టడీలో ఒక వ్యక్తి చనిపోవడంపై మద్రాస్ హైకోర్టు విచారించింది. హైకోర్టు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జూన్ 27న ఒక ఆలయం నుంచి ఆభరణాలను దొంగలించాడనే కేసులో అరెస్ట్ కాబడిన అజిత్ కుమార్‌పై ‘‘ అధికార మత్తులో ఉన్న పోలీసులు’’ దారుణంగా దాడి…
తమిళనాడులోని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న విజీపీ అమ్యూజ్‌మెంట్ పార్క్ లో రోలర్ కోస్టర్ నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఎనిమిది మంది పిల్లలు, పది మంది మహిళలు సహా ముప్పై మంది దాదాపు మూడు గంటల పాటు 70 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు పర్యాటకులు. పైకి వెళ్ళిన రోలర్ తిరిగి కిందకు వచ్చే సమయంలో సాంకేతికత లోపం కారణంగా ఆగిపోయింది.…
Emirates Draw : అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తట్టేస్తుందో చెప్పడం అసాధ్యం. ఒక్కసారి అదృష్టం వరించిందంటే ఓ రాత్రిలోనే జీవితమే మారిపోతుంది. చెన్నైకి చెందిన 56 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ శ్రీరాం రాజగోపాలన్ కథ కూడా అలాంటిదే. ఈయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ‘ఎమిరేట్స్ డ్రా MEGA7’ లాటరీలో ఏకంగా 231 కోట్లు గెలుచుకుని ఒక్కరాత్రిలో కోటీశ్వరుడిగా మారిపోయాడు. శ్రీరాం రాజగోపాలన్ తన జన్మదినమైన మార్చి 16న ఎమిరేట్స్ డ్రా లాటరీ టికెట్‌ను ఆన్‌లైన్‌లో…
Tragedy : హోసూరు పారిశ్రామికవాడలో ప్రేమ విషాదంగా మారింది. ఆరేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో చిగురించిన ప్రేమ పెళ్లి బంధంతో ఒక్కటైన భాస్కర్, శశికళ జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. జూజువాడి ఉప్కర్ నగర్ రాజేశ్వరిలేఔట్ వారి ప్రేమకు చిరునామాగా నిలిచింది. నలుగురు, రెండేళ్ల వయసున్న ఆరూష్, శ్రీషా అనే ఇద్దరు పిల్లలు వారి అనుబంధానికి గుర్తుగా వెలిశారు. హోసూరు పరిసర ప్రాంతాల్లో జిమ్ సెంటర్లు నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న సమయంలో వారి జీవితంలో చీకటి నీడలు కమ్ముకున్నాయి.…
Khushboo : తమిళనాడులో దారుణమైన ఘటన జరిగింది. నెలసరి కారణంతో ఓ విద్యార్థినిని బయటే కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై తాజాగా నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ స్పందించారు. తన రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. నెలసరి పేరుతో స్టూడెంట్ ను అలా బయట కూర్చోబెట్టడం అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. Read Also…
Amit Shah: పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, సీఎం ఎంకే స్టాలిన్, కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. డీలిమిటేషన్‌పై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి కూడా ఆయన పిలుపునిచ్చారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 లోక్‌సభ స్థానాలను కోల్పోతుందని ఆయన ఆరోపిస్తున్నారు.
Miraculous Escape : తమిళనాడులోని పక్కోట్ టౌన్‌లో జరిగిన ఓ నమ్మశక్యంకాని సంఘటన ప్రత్యక్ష సాక్షులను విస్మయానికి గురి చేసింది. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి రెండు కదులుతున్న బస్సుల మధ్య చిక్కుకుపోయి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ గుండె ఆగిపోయే క్షణాన్ని సృష్టించాడు. బస్సులు ఒకదానికొకటి ప్రమాదకరంగా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తి ఏదో ఒకవిధంగా రెండు వాహనాల మధ్య నుంచి బయటపడ్డాడు. కానీ.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే…
Tamil Nadu: తమిళనాడులో 24 గంటల వ్యవధిలో మూడు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయమై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి.