TVK Chief Vijay : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎమోషనల్ అయ్యాడు. స్టేజి మీదే అందరి ముందు ఏడ్చేశాడు. విజయ్ పెట్టిన పార్టీ టీవీకే. పార్టీని అనౌన్స్ చేసే కార్యక్రమం తర్వాత మళ్లీ ఇన్ని రోజులకు నేడు మధురలో మానాడు కార్యక్రమం నిర్వహించారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో తనకోసం వచ్చిన లక్షల మందిని చూసి విజయ్ ఉప్పొంగిపోయారు. ఆయన ఎక్స్ ప్రెషన్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయాయి. పార్టీ జెండాను ఆవిష్కరించే క్రమంలో ఆయన లక్షలాది మంది జనాలను చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు.
Read Also : TVK Chief Vijay : సింహం వేట మొదలైంది.. డీఎంకేతోనే పోటీ : విజయ్
ఆయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సభలో చాలా ఎమోషనల్ గా మాట్లాడారు విజయ్. తనకు బీజేపీతోనే శత్రుత్వం ఉందన్నారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలిపేది లేదన్నారు. డీఎంతో పోరాడుతామన్నారు. ఆ పార్టీని గద్దె దించుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని.. కచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. తమిళనాడులో సింహం వేట మొదలైందన్నారు. తనకు మతం, కులం ముఖ్యం కాదని.. తమిళనాడుకే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు టీవీకే చీఫ్ విజయ్.
Read Also : Nara Rohith : నా ఇంటిపేరుతోనే జనాలకు సమస్య.. నారా రోహిత్ కామెంట్స్
TVK President Vijay got Emotional #TVKMaduraiMaanadu pic.twitter.com/iWjzPj5rN0
— Ayyappan (@Ayyappan_1504) August 21, 2025