TVK Chief Vijay : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. టీవీకే పార్టీ మానాడు కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తమిళనాడులో సింహం వేట మొదలైంది. ఇక నుంచి రణరంగమే జరుగుతుంది. తమిళనాడులోని ప్రతి ఇంటి డోర్ కొడుతాం. అందరినీ కలుపుకునిపోతాం. ఏ పార్టీతోనూ మేం చేతులు కలపం. ఒంటరిగానే పోరాడుతాం. రాబోయే తమిళ నాడు ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. భావజాల బీజేపీతో అస్సలు చేతులు కలపం. డీఎంకేతోనే మాకు పోటీ అంటూ తేల్చి చెప్పారు విజయ్. తనను ఎంత మంది విమర్శిస్తే అంత ఎత్తుకు ఎదుగుతానంటూ తెలిపారు.
Read Also : Nara Rohith : నా ఇంటిపేరుతోనే జనాలకు సమస్య.. నారా రోహిత్ కామెంట్స్
తాను కులానికి, మతానికి అతీతుడిని అన్నారు. కేవలం తమిళనాడుకే తన ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజకీయంగా తనను విమర్శిస్తే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలిపేది లేదు. ఆ పార్టీకి భావజాలం ముఖ్యం. తమిళనాడు అస్తిత్వాన్ని కదిలించే ప్రయత్నం ఎవరు చేసినా ఊరుకునేది లేదు. ఇప్పుడున్న పార్టీలు అన్నీ తమిళనాడు భావాన్ని తగ్గించేందుకు చూస్తున్నాయి. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఢిల్లీలో రహస్య మంతనాలు చేస్తున్నారు. ఆయన పాలనలో అవినీతి బాగా పెరిగిపోయింది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఆర్ ఎస్ ఎస్ లాంటి వారి ముందు ఆయన తల వంచుతున్నారు అంటూ చెప్పారు టీవీకే చీఫ్ విజయ్. రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్ గా పాలిటిక్స్ లో బిజీగా ఉంటానని తెలిపారు.
Read Also : Udaya Bhanu : అల్లు అర్జున్ తో చేసి.. పవన్ సినిమాకు నో.. ఉదయభానుపై ట్రోల్స్