తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికి రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించారు. ద్విభాషా విధానానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర విద్యా విధానం (ఎస్‌ఈపీ)ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ విధానం కేంద్ర జాతీయ విద్యా విధానానికి నిర్ణయాత్మక విరామంలాంటిదని పేర్కొ్న్నారు. సైన్స్, ఏఐ, ఇంగ్లీష్‌లకు పెద్ద పీట వేశారు. ఇక 11, 12 తరగతుల మార్కుల ఆధారంగా యూజీ అడ్మిషన్లు ఉంటాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఈసీపై రాహుల్‌గాంధీ యుద్ధం.. బెంగళూరులో ధర్నా
కొత్త విద్యా విధానాన్ని రూపొందించడానికి 2022లో రిటైర్డ్ జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని స్టాలిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ గత ఏడాది జూలైలో ముఖ్యమంత్రికి నివేదికను సమర్పించింది. ఆ నివేదికను తాజాగా ముఖ్యమంత్రి విడుదల చేశారు. 3, 5, 8 తరగతులకు పబ్లిక్ పరీక్షలకు నిర్వహించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చింది. దీని కారణంగా అధిక డ్రాపౌట్ రేట్లు పెరుగుతాయని అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: UK-Israel: గాజాను స్వాధీనం చేసుకునే నిర్ణయం సరైంది కాదు.. బ్రిటన్ ప్రధాని అభ్యంతరం
తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ మాట్లాడుతూ.. 10వ తరగతి వరకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర బోర్డుతో సహా అన్ని బోర్డులలో విద్యార్థులు తమిళం చదువుతారన్నారు. జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా విధానానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కమిటీ ఎలాంటి కాపీ కొట్టలేదని పేర్కొన్నారు.
తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్.. తమిళనాడు విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది రాష్ట్ర అహంకార విధానం అని అభివర్ణించారు. స్టేట్ పాలసీ జాతీయ విధానినికి కట్ అండ్ కాపీ అని విమర్శించారు. ఈ పద్ధతి విభజనాత్మకం అని అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను కుదించాలని కోరుకుంటోందని ఆరోపించారు.