మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ హెల్త్ కార్డ్స్ పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావును గుర్తు చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో తన గురించి ఆయన ఒక మంచి ఆర్టికల్ రాయడంతో పొంగిపోయానని, ఆ తరువాత పసుపులేటి రామారావును కలిసి ఏదైనా బహుమతి ఇద్దామనుకుంటే, ఆయన సున్నితంగా తిరస్కరించారని, ఇలాంటి వాటికోసం ఆర్టికల్ రాయలేదని, నాలాంటి యంగ్ స్టర్స్ ను ప్రోత్సహించడానికే రాశానని అన్నారని, ఆ మాట ఆయనపై తనకు అమితమైన గౌరవాన్ని పెంచిందని అన్నారు. ఇక గుడిపూడి శ్రీహరి, వి.ఎస్.ఆర్. ఆంజనేయులు, నందగోపాల్ వారితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.
Read Also : Acharya Movie Twitter Review : టాక్ ఏంటంటే?
తెలుగు డిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కు ఏ అవసరం వచ్చినా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక ఈ అసోసియేషన్ కు సినిమాకు ఓ లక్ష రూపాయిలు కేటాయిస్తే బాగుంటుందంటూ తలసాని తీసుకొచ్చిన ప్రతిపాదనను ముందుకు తీసుకెళతాం. మీరు సొంతం అసోసియేషన్ ను ప్రారంభించి, హెల్త్ కార్డులు పంపిణి చేయడం గొప్ప విషయం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటూ ఈ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. నిజానికి అవార్డులు నిరాదరణకు గురయ్యాయి. రాష్ట్రం విడిపోయాక అసలు సినిమా రంగానికి అవార్డు అనే ప్రోత్సాహమే లేకుండా పోయిందని అన్నారు చిరు.