Talasani Srinivas: ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు నంది అవార్డ్స్.. తలసాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas: నంది అవార్డులు అడిగిన వారికి ఇవ్వడం లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నంది అవార్డుల అంశంపై తలసాని స్పందించారు. నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. అని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ అడగలేదని చెప్పారు. కొందరు మీడియా చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నంది అవార్డులు అడిగిన వారికి ఇవ్వడం లేదని మంత్రి తలసాని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఏడాది సినిమాకు నంది అవార్డులు ఇచ్చేలా ఆలోచిస్తామని చెప్పారు. హైదరాబాద్ మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీలో దర్శక రత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Read also: KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఈ సందర్భంగా నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కొందరు సినీ ప్రముఖులు చేస్తున్న విమర్శలపై మంత్రి తలసాని స్పందించారు. నంది అవార్డుల విషయంలో బాధ్యులైన వారెవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో సహకారం అందిస్తుందన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎన్నోసార్లు ప్రశంసించారని మంత్రి గుర్తు చేశారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడం, ఐదో షో ఆడేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా ప్రభుత్వం టాలీవుడ్‌కు అండగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులు నిలిచిపోయిన మాట వాస్తవమేనన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. “దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. చిత్రపురి కాలనీకి దాసరి ఎంతో కృషి చేశారు. సినీ పరిశ్రమ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా ముందుకు సాగే వ్యక్తి దాసరి. ఆయన చిత్రాలు ఎంతో సందేశాత్మకంగా ఉన్నాయి. “దాసరి మరణానంతరం సినీ పరిశ్రమ దిక్కును కోల్పోయింది’’ అని మంత్రి తలసాని అన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగల్లుకు మోసగాడు’ రీరిలీజ్ కానున్న సందర్భంగా నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇచ్చేందుకు ఇరు ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ అవార్డుకు విలువ ఉండేదన్నారు. ఇప్పుడు అవార్డుకు విలువ లేకుండా పోయిందన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!