పంజాబ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి తేజేంద్రపాల్ సింగ్ బగ్గా అరెస్ట్, విడుదల నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. బగ్గాను అర్ధరాత్రి గురుగ్రామ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఆయన వీపు, భుజానికి గాయమైందని లాయర్ చెప్పడంతో.. ఆయన విడుదలకు మేజిస్ట్రేట్ అనుమతించారు. దాంతో బగ్గా ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు ఢిల్లీలోని తేజేంద్రపాల్ సింగ్ బగ్గా నివాసంలో ఆయన్ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను జనక్‌పురి పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు.…