Earthquake In Taiwan: తైవాన్ (Taiwan) దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ భూకంపం (Earthquake) సంభవించింది. యుజింగ్ జిల్లాలో (Yujing district) రాత్రి పలుమార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు భయాందోళన చెందిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దక్షిణ తైవాన్‌లో సోమవారం రాత్రి మొదట 5.1 తీవ్రతతో…
Earthquake: వరస భూకంపాలతో పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. గురువారం రోజు ఈశాన్య తైవాన్ ప్రాంతంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) తెలిపింది. ఈ భూకంప ప్రకంపనలకు రాజధాని తైపీలోని భవనాలు వణికాయి.
Taiwan Earthquake: తైవాన్ భూకంపం అక్కడి ప్రజలకు పీడకలను మిగిల్చింది. 7.2 తీవ్రవతో వచ్చిన భూకంప ధాటికి చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. 9 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. గత 5 దశాబ్ధాల కాలంగా ఇలాంటి భూకంపాన్ని తైవాన్ వాసులు చూడలేదు.
Earthquake Hits Iran: ఇరాన్ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. వాయువ్య ఇరాన్ లోని పశ్చిమ అజార్ బైజార్ ప్రావిన్సులోని భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 528 మంది గాయపడ్డారు. 135 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. భూకంపం ధాటికి 12 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు.
Magnitude 7.5 Earthquake Hits Mexico: లాటిన్ అమెరికా దేశం మెక్సికోలో భారీ భూకంపం వచ్చింది. మైకోకాన్ రాష్ట్రంలోని లా స్లతాసిటీ డియోరెలోస్ కు దక్షిణ-ఆగ్నేయంగా 46 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో భూకంప రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మిచోకాన్ తీరానికి సమీపంలో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు యూఎస్ సునామీ హెచ్చరికలు వ్యవస్థ…
Earthquake Hits Taiwan: తైవాన్ తీరం ఉలిక్కిపడింది. ఆదివారం తైవాన్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. టైటుంగ్ నగరానికి ఉత్తరాన 50 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం కేంద్రీకృతం అయిందని తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 7.2 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. అయితే దీన్ని ఆ తరువాత 6.9 మాగ్నిట్యూడ్ కు తగ్గించింది. భారీ భూకంపం సంభవించడంతో జపాన్ సునామీ హెచ్చరికలను జారీ…