ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘తడప్’. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఆర్.ఎక్స్. 100’కు ఇది హిందీ రీమేక్. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ట్రైలర్ ను సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ‘ఆహాన్… నువ్వు పెరగడం మేం చూశాం. ఇవాళ నీ తొలి చిత్రం ‘తడప్’ ట్రైలర్ తో ప్రపంచ సినిమాకు నిన్ను పరిచయం చేయడం…