సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్న విషయం అందరికి తెలిసిందే అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే కారణం మాత్రం ఎవరికి తెలియదు. తాజగా ఆ కారణాన్ని టబు రివీల్ చేసింది. తాను సింగిల్ గా ఉండడానికి కారణం ఒక స్టార్ హీరో అని చెప్పి షాకిచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ వలనే తాను ఇలా సింగిల్…
టబు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన తార. తెలుగునాట టాప్ హీరోస్ అందరితోనూ నటించి ఆకట్టుకున్న అభినేత్రి టబు. ఉత్తరాదిన సైతం నటిగా తానేమిటో చాటుకున్న అందాలతార. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన టబు, తెలుగు చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. నవంబర్ 4తో టబు యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికే టబు తపిస్తున్నారు. టబు పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. 1971…
పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటుంది నటి టబు. అంత సెలక్టీవ్ గా ఉంటుంది కాబట్టే తక్కువ సినిమాలు చేస్తూ ఉంటుంది. తాజాగా మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో సినిమా చేయటానికి ఒప్పుకుంది టబు. గతంలో మహేశ్ దర్శకత్వం వహించిన ‘అస్థిత్వ’లో లీడ్ రోల్ చేసింది టబు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా జాతీయ అవార్డును సాధించింది. దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహేశ్, టబు కలసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో టబు…
టబు, వినీత్, అబ్బాస్ లు కలిసి నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా ‘ప్రేమదేశం’.. అప్పటివరకు రొటీన్ లవ్ స్టోరీ కథలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఈ సినిమా ప్రేమను, స్నేహాన్ని చూపించే కోణాన్నే మార్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే రాబోయే తరం ప్రేమ కథలను ఇరువై ఏళ్లకు ముందే ఈ చిత్రం చెప్పేసింది. తమిళంలో ‘కాదల్ దేశం’ చిత్రంగా రాగా తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో విడుదలై అక్కడి కంటే ఇక్కడ ఎక్కువ విజయవంతం అయింది. ఎ.ఆర్.రహమాన్…
(ఆగస్టు 23న ‘ప్రేమదేశం’కు 25 ఏళ్ళు పూర్తి) ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ ఆకర్షించే అంశమేది అంటే ‘ప్రేమ’ అనే చెప్పాలి. కాలం మారినా ప్రేమకథలకు సాహిత్యంలోనూ, సమాజంలోనూ, సినిమాల్లోనూ ఆదరణ ఉంటూనే ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఆ ఉద్దేశంతోనే కాబోలు తాను తెరకెక్కించిన అన్ని చిత్రాలనూ ప్రేమ చుట్టూ తిప్పాడు. టైటిల్స్ లోనూ ప్రేమనే జోడించాడు. ఆయన దర్శకత్వంలో ‘జెంటిల్ మేన్’ కె.టి.కుంజుమోన్ నిర్మించిన ‘కాదల్ దేశం’ చిత్రం తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో విడుదలై విజయఢంకా…
(జూలై 12తో ‘కూలీ నంబర్ 1’కు 30 ఏళ్ళు) కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘కలియుగ పాండవులు’ చిత్రం ద్వారా హీరోగా జనం ముందు నిలిచారు వెంకటేశ్. తొలి సినిమా సక్సెస్ తోనే ‘విక్టరీ’ వెంకటేశ్ గా జనం మదిని గెలిచారు. ఆ తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్ “భారతంలో అర్జునుడు, ఒంటరి పోరాటం, కూలీ నంబర్ వన్” చిత్రాలలో నటించారు. వీటి తరువాత “ముద్దుల ప్రియుడు, సాహసవీరుడు-సాగరకన్య, సుభాష్ చంద్రబోస్” చిత్రాలలోనూ రాఘవేంద్రరావు, వెంకటేశ్ కాంబో సాగింది. అయితే…
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ లోకి దర్శకుడు డేవిడ్ ధావన్ రీమేక్ చేయనున్నారు. కార్తీక్ ఆర్యన్-కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. హిందీ రీమేక్ వెర్షన్ కు అల్లు అరవింద్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన టబు పాత్రలో బాలీవుడ్లో మనీషా కొయిరాల చేయనుందట.…