Tabu: నిన్నే పెళ్లాడతా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ టబు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన టబు ఇప్పుడు కూడా అదే స్టార్ డమ్ ను మెయింటైన్ చేస్తోంది. ఇక నేడు ఆమె పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను నెటిజన్లు బయటకు తోడుతున్నారు. టబు స్టార్ హీరోయిన్ ఫరా నాజ్ సోదరి అని అందరికి తెల్సిందే. ఫరా షూటింగ్ వెళ్లిన ప్రతిసారి చెల్లి టబును కూడా వెంటబెట్టుకెళ్ళేదట. అలా ఒకేసారి జరిగిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించిందని కొన్ని బాలీవుడ్ కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ఘటన ఏంటంటే.. ఫరా, జాకీ ష్రాఫ్ జంటగా ఓ సినిమా షూటింగ్ మారిషస్‌లో జరుగుతోంది.
ఇక ఆ షూటింగ్ కు అక్కతో పాటు టీనేజ్ లో ఉన్న టబు కూడా వెళ్ళింది. అయితే షూటింగ్ తరువాత ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన డేనీ డెంగ్జోపా చిత్ర బృందానికి ఒక పార్టీ ఇచ్చాడట. ఆ పార్టీలో ఫరాతో సహా అందరూ ఫుల్ల్ గా మద్యం సేవించి ఉండడంతో టబు భయపడి అక్కను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా.. జాకీ ష్రాఫ్ మద్యం మత్తులో టబును రేప్ చేయడానికి ప్రయత్నించాడట. లైంగికంగా వేధిస్తూ ఇబ్బంది పెట్టాడట. అంతలోనే డేనీ డెంగ్జోపా ఆ విషయాన్ని గ్రహించి టబును అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారట. ఈ విషయం కొన్నాళ్ళు బయటికి తెలియకపోయినా చెల్లికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ఫరా, జాకీ ష్రాఫ్ ను నిలదీసినట్లు వార్తలు వచ్చాయి. అందుఎక్ ఇప్పటివరకు టబు, జాకీ ష్రాఫ్ తో నటించలేదట.