Team India: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో కీలక ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా దూరమయ్యాడు. చీలమండ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు దూరమైన దీపక్ చాహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో దక్షిణాఫ్రికాతో మిగతా రెండు వన్డేల నుంచి అతడు తప్పుకున్నాడు.…
Team India: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో మరో ఆటగాడిని త్వరలో ఎంపిక చేస్తామని తెలిపింది. దీంతో బుమ్రా స్థానంలో ఎవరు ఎంపికవుతారనే చర్చలు మొదలయ్యాయి. సీనియర్ బౌలర్ షమీని తీసుకుంటారా లేదా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన దీపక్ చాహర్‌ను ఎంపిక చేస్తారా అంటూ పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునీల్ గవాస్కర్ లాంటి మాజీ…
Rohit Sharma: టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. టీ20 ప్రపంచకప్ ముంగిట రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ హుడా గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తుండగా ముక్కు నుంచి రక్తం కారడం టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల్లో ఆందోళన కలిగించింది. రోహిత్ దగ్గరకు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వచ్చి కర్చీఫ్ అందించి ఏమైందో అడిగి తెలుసుకున్నాడు.…
టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీం ఇండియాకు మరో గట్టి దెబ్బే తగలింది. ఇప్పటికే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. మోకాలి సర్జరీ చేయించుకొని రెస్ట్ లో ఉన్నాడు. మరో ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడని భావించిన శార్దూల్ ఠాకూర్ కూడా గాయంతో ఆసీస్‌తో సిరీస్‌కు ముందే జట్టు నుంచి వైదొలిగాడు. ఇప్పుడు వెన్నునొప్పితో బూమ్రా కూడా తప్పుకోవడంతో… వరుస గాయాలు టీం ఇండియాను కలవరపెడుతున్నాయి. గత ప్రపంచకప్‌లో పేవలమైన ప్రదర్శనతో… గ్రూప్ స్టేజ్ లోనే భారత్ ఇంటిముఖం పట్టింది. ఓటమికి…
Rahul Dravid: ఆసియా కప్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన భారత అభిమానులకు కలవరపరుస్తోంది. ముఖ్యంగా టీమ్ పేలవమైన బౌలింగ్ ప్రదర్శనతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో రాబోయే టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్‌కు మరిన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు, వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించడం మేలని కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఎక్కువ వార్మప్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐని కోరాడు. ద్రవిడ్ విజ్ఞప్తితో పాటు అభిమానుల…
Team India: ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన తొలి టీ20 చూసిన తర్వాత టీమిండియా అభిమానులందరూ ఓ అంచనాకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ గెలిచేంత సీన్ అయితే లేదని పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు టీ20ల్లో మన జట్టే తోపు అన్న ఫీలింగ్‌లో ఉన్న అభిమానులే ఇప్పుడు తమ మనసు మార్చుకున్నారు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా ఉన్న మన జట్టు గురించి అంచనాలు పెట్టుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. కానీ…
T20 World Cup: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో బ్యాట్ పట్టబోతున్నాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ ఓపెనర్‌గా రాబోతున్నాడు. ఇదంతా నిజమా అని మీరు అనుకోకండి. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఇండియన్ టీమ్‌లోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఓ టీవీ యాంకర్ న్యూస్ చదువుతూ తడబడ్డాడు. ఇండియన్ టీమ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నట్లు…