Producer T.G. Vishwaprasad: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలతో పాటు మొత్తం పదికి పైగా సినిమాలను నిర్మిస్తోంది ఈ సంస్థ.
జగపతిబాబు కీలక పాత్ర పోషించిన 'రామబాణం' చిత్రం శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' తర్వాత తనకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయని జగ్గూభాయ్ చెబుతున్నారు.