Swiggy's Losses: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ నష్టాలు 2022 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపయ్యాయి. అంతకుముందు ఏడాది 16 వందల 17 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 629 కోట్ల రూపాయలకు చేరాయి. ఖర్చులు సైతం భారీగా.. అంటే.. ఏకంగా 131 శాతం పెరిగి 9 వేల 574 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కి స్విగ్గీ సమర్పించిన వార్షిక ఆర్థిక నివేదిక ఈ వివరాలను…
Today (02-01-23) Business Headlines: హైదరాబాద్ బిర్యానీకి అత్యధిక ఆర్డర్లు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పండగ చేసుకుంది. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల బిర్యానీలను మరియు రెండున్నర లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను డెలివరీ చేసింది. 75 శాతం మందికి పైగా కస్టమర్లు హైదరాబాద్ బిర్యానీనే కోరుకున్నారని ట్విట్టర్‌లో నిర్వహించిన సర్వేలో తేలినట్లు స్విగ్గీ వెల్లడించింది.
Swiggy Delivered 3.5 Lakh Biryanis On New Year's Eve: ప్రపంచం మొత్తం 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. ఇదిలా ఉంటే ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఏకంగా డిసెంబర్ 31 శనివారం రోజు 3.5 లక్షల బిర్యానీలను డెలివరీ చేసింది. రాత్రి 10.25 గంటల వరకు దేశవ్యాప్తంగా 61,000 పిజ్జాలను పంపిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే అన్ని రకాల బిర్యానీల్లో హైదరాబాద్ బిర్యానీనే టాప్ లో నిలిచింది. మరోసారి హైదరాబాద్ బిర్యానీకి…
పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీయే.. బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. కుదిరితే ఏదైనా హోటల్‌కు వెళ్లి ఇష్టమైన బిర్యానీ లాగించాలి.. లేదా ఆర్డర్ పెట్టి తినేయాలి.. అయితే, బిర్యానీ లాగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.. భారతీయులు ఈ ఏడాది బిర్యానీని భారీ స్థాయిలో ఆరగించేశారు. 2022 ఏడాదిలో కేవలం స్విగ్గీ ద్వారా నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.. గత ఏడాదితో పోలిస్తే.. ఇది ఎక్కువ..…
Swiggy Layoff: ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం నేపథ్యంలో బడాకంపెనీలు చాలావరకు ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి. పనితీరు సరిగి లేని ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి.
Chennai man Worked in Three Companies: వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రెండు కంపెనీలలో పని చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడం చూశాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా మూడు ఉద్యోగాలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే చెన్నైలో ఓ వ్యక్తి ఒకే సమయంలో మూడు కంపెనీలలో ఉద్యోగాలను చేస్తున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. శ్వేతా శంకర్ అనే మహిళ ర్యాపిడో బుక్ చేసుకోగా.. శంకర్…
దేశంలో ఫుడ్ డెలవరీ బిజినెస్ ఆపరేటర్లు పెరిగిపోతున్నారు. స్విగ్గీ, జొమాటోతో పాటు మరికొన్ని సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. బిజీ షెడ్యూల్ వల్ల ఫుడ్ డెలవరీ ఆపరేటర్లకు భలే గిరాకీ పెరిగింది. కొన్నాళ్లుగా మెట్రోలు, ప్రధాన నగరాలకే పరిమితం అయిన ఫుడ్ డెలవరీ రంగం ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కస్టమర్ల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అయితే వీటిని పరిష్కరించే మార్గాలను ఫుడ్ డెలవరీ ఆపరేటర్లు విస్మరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి.…
విజయవాడలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. స్విగ్గీ సంస్థ పని గంటలు పెంచడంతో పాటు ఇన్సెంటివ్స్ తగ్గించడంతో డెలివరీ బాయ్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం ఇన్సెంటివ్స్ తగ్గించిన నేపథ్యంలో తమకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పెంచకుండా తగ్గించటం పట్ల స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పగలంతా కష్టపడినా తమకు రూ.270 మాత్రమే వస్తున్నాయని.. పెట్రోల్ ఇన్సెంటివ్ కూడా తొలగించారని డెలివరీ బాయ్స్ ఆరోపిస్తున్నారు. Read Also: Illegal Affairs: ఏపీలో మగాళ్లు…
‘స్విగ్గీ’ గురించి ప్రత్యేకం పరిచయం చేయాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఫుడ్ డెలవరీలతో చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం మెట్రోసిటీల్లో బిజీ లైఫ్ కారణంగా హోటళ్లు వెళ్లి తినే అలవాటును తగ్గించుకుంటున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలవరీ ప్లాట్ ఫారాలను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఆర్డర్లు చేసిన తక్కువ సమయంలో నేరుగా ఫుడ్ ను ఇళ్లు తీసుకువస్తున్నారు. దీంతో స్విగ్గీ సంస్థకు ఆదాయం బాగానే వస్తోంది. ఇదిలా ఉంటే స్విగ్గీ ఇన్నాళ్లుగా నిర్వహిస్తున్న…