ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ ఈ పండుగ సీజన్‌లో భారీగా దండుకోవాలని చూస్తున్నాయి. దీపావళి పండగ వేళ నిన్న ప్లాట్‌ఫామ్ ఫీజును జొమాటో పెంచగా.. ఈరోజు స్విగ్గీ పెంచింది. ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున స్విగ్గీ వసూలు చేయనుంది. ఇంతకుముందు ఈ ఫీజుగా రూ.7గా ఉంది. జొమాటో ప్లాట్‌ఫామ్ ధరల్ని పెంచిన రోజు వ్యవధిలోనే.. స్విగ్గీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్లాట్‌ఫామ్ ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని స్విగ్గీ యాప్…