Swiggy Platform Fee: నిన్న జొమాటో.. నేడు స్విగ్గీ! ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేశాయిగా
- జొమాటో బాటలోనే స్విగ్గీ
- ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ
- ప్లాట్‌ఫామ్ ఫీజుపై కూడా జీఎస్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ ఈ పండుగ సీజన్‌లో భారీగా దండుకోవాలని చూస్తున్నాయి. దీపావళి పండగ వేళ నిన్న ప్లాట్‌ఫామ్ ఫీజును జొమాటో పెంచగా.. ఈరోజు స్విగ్గీ పెంచింది. ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున స్విగ్గీ వసూలు చేయనుంది. ఇంతకుముందు ఈ ఫీజుగా రూ.7గా ఉంది. జొమాటో ప్లాట్‌ఫామ్ ధరల్ని పెంచిన రోజు వ్యవధిలోనే.. స్విగ్గీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
ప్లాట్‌ఫామ్ ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని స్విగ్గీ యాప్ ద్వారా స్పష్టమైంది. యాప్ ఓపెన్ చేయగానే.. ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజు హైదరాబాద్‌లో రూ.10గా చూపిస్తోంది. జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10కి పెంచిన విషయం తెలిసిందే. జొమాటో మాదిరే స్విగ్గీ కూడా దశల వారీగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ వస్తోంది. ప్లాట్‌ఫారమ్ ఫీజును రూ.10కి పెంచడంతో.. సోషల్ మీడియాలో ఆహార ప్రియులు మండిపడుతున్నారు. ‘ఫుడ్ ఆర్డర్ చేయడం ఉచిత డెలివరీతో ప్రారంభమైంది. ఇప్పుడు జీఎస్టీ, డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు, ప్లాట్‌ఫామ్ ఫీజు వచ్చాయి’ అని ఒకరు ట్వీట్ చేశారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Also Read: OnePlus 13 Lauch: ‘వన్‌ప్లస్ 13’ వచ్చేస్తోంది.. ట్రిపుల్ కెమెరా, జంబో బ్యాటరీ!
పండగ సీజన్‌లో సేవలు అందించేందుకు ప్లాట్‌ఫామ్ ధరలు పెంచామని, తమ బిల్లులు చెల్లించేందుకు ఈ రుసుములు సాయపడతాయని జొమాటో పేర్కొంది. స్విగ్గీ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ప్లాట్‌ఫామ్ ఫీజు అనేది జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలు, డెలివరీ ఫీజుకు అదనంగా వసూలు చేస్తున్నాయి. ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.10 పైన కూడా 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఒక్కో ఆర్డర్‌పై రూ.11.80 అదనంగా చెల్లించాలన్నమాట.
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!