పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ హిట్ 'ఖుషి' చిత్రాన్ని డిసెంబర్ 31న 2022కి వీడ్కోలు పలుకుతూ, 2023కి సుస్వాగతం చెబుతూ విడుదల చేశారు. పవన్ అభిమానులకు ప్రస్తుతం 'ఖుషి' ఆనందం పంచుతోంది. సరిగా పాతికేళ్ళ క్రితం అంటే 1998లో జనవరి 1వ తేదీనే పవన్ కళ్యాణ్ ఆ యేడాదికి 'సుస్వాగతం' పలుకుతున్నట్టుగా అదే టైటిల్ తో రూపొందిన తన చిత్రాన్ని విడుదల చేశారు.