మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక డైలీ సీరియల్‌గా కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపుగా 9 రోజులైంది. కానీ ఈరోజుకి సీఎం అభ్యర్థి పేరు ప్రకటించలేదు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. దాదాపు 9 రోజులవుతున్నా.. ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని నియమించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక బీజేపీ అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపు నేటికి 9 రోజులైంది. అయినా కూడా ఈనాటికి సీఎం అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయారు. హైకమాండ్ పెద్దలు ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది.
Maharashtra: మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఈరోజు (మంగళవారం)తో గడువు ముగియనుంది. కాబట్టి కొత్త సర్కార్ ఏర్పాటుకు మహయుతి కూటమి ప్లాన్ చేస్తుంది.
TDP Office Attack Case: గుంటూరు జిల్లాలోని తెలుగు దేశం కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనలో కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. కొంత మంది కీలక నేతలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అసత్య ప్రచారాలను పోలీసు అధికారులు కొట్టి పారేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపే పార్టీ హైకమాండ్ మొగ్గుచూపిందని.. ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పార్టీలో తీవ్ర సందిగ్ధత కొనసాగుతోంది.