TDP Office Attack Case: గుంటూరు జిల్లాలోని తెలుగు దేశం కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనలో కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. కొంత మంది కీలక నేతలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అసత్య ప్రచారాలను పోలీసు అధికారులు కొట్టి పారేస్తున్నారు. కాగా, హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు కొన్ని టీంలు వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ ల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిపిన వారి కదలికలపై నిఘాపెట్టామని.. కేసులో ఉన్న అందరిని అరెస్టు చేస్తామని అంటున్నారు. ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని తాడేపల్లి పోలీసులు చెబుతున్నారు.
Read Also: SSMB 29: మహేశ్ – రాజమౌళి సినిమా కీలక అప్ డేట్.. ఇక్కడ చదవండి..
కాగా, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను హైదరాబాద్ లోని తన ఫాం హౌస్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు ఆయనను హాజరుపర్చగా.. మంగళగిరి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో సురేష్ 80వ నిందితుడిగా ఉన్నారు.