భూఆక్రమణలు,వసూళ్ళకు పాల్పడితే, టిఆర్ఎస్ కౌన్సిలర్లు,నాయకులను పార్టీనుండి సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనపై వాఖ్యలు చేశారు. మున్సిపాలిటీకి చెందిన పది శా తం, మరికొన్ని స్థలాలు, గాంధీ ట్రస్టు భూమి, దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని.. అధికార పార్టీ నాయకులే కబ్జాలు చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గాంధీ ట్రస్టు సుమారు 60 ఏండ్ల కిందట ఏర్పాటైందని, రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా దేవాలయ భూ ములు అంటూ లేవన్నారు. అలాంటి భూ ములపై ఆరోపణలు చేస్తూ ప్రజలను తికమక పెడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాం టి అక్రమాలకు పాల్పడలేదన్నారు. అక్రమాలు జరుగుతున్నట్లు ప్రజ ల దృష్టికి వస్తే తనకు తెలియజేయాలని కోరారు. జడ్చర్లలో రెండు మినీ ట్యాంక్ బండ్ లు, రోడ్ల విస్తరణ, డివైడర్లు ఏర్పాటు చేశామన్నారు.
రంగనాయకుల గుట్టను టూరిస్ట్ స్పాట్‌గా చేయడమేకాకుండా గుట్టపై పార్కులు అభివృద్ధి చేశామన్నారు. పట్టణంలో ఎక్కడెక్కడ 10 శాతం ఖాళీ స్థలాలు ఉన్నాయో గుర్తించి.. అన్యాక్రాంతం కాకుండా ఫెన్షింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 30 పార్కులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రామ పం చాయతీ లేఅవుట్లతో ఇబ్బందులు ఉన్నందునే.. ప్రభుత్వం డీ టీసీపీ లేఅవుట్లకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జీపీ లేఅవుట్లలో.. ఒక దాంట్లో రోడ్డుచూపించి.. మరో దాంట్లో అదే రోడ్డును 10 శాతం భూమి అని చూపించి ప్లాట్లు విక్రయించడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
justinbieber : పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కి ముఖ పక్షవాతం