బెంగళూరులో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఓ షూటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కి, దుండగులకు మధ్య అర్ధరాత్రి భల్స్వా డెయిరీ ప్రాంతంలో ఘర్షణ జరిగింది.
అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. తాజాగా, యూఎస్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇల్లినాయిస్‌లోని చికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు.