Nepal: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి శుక్రవారం దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నేపాల్ సార్వభౌమాధికారంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో 51 మంది మరణించారు.
నేపాల్ ప్రధాని సుశీలా కర్కితో ప్రధాని మోడీ తొలిసారి సంభాషించారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన సంక్షోభం కారణంగా కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ సుశీలా కర్కిని తాత్కాలిక ప్రధానిగా ఎన్నకున్నారు.
Sushila Karki: నేపాల్‌లో కొత్త శకం మొదలైంది. హిమాలయ దేశానికి తొలి మహిళా ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణస్వీకారం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా జెన్-జెడ్ నిరసనకారులు చేసిన ఆందోళనలతో కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెన్-జెడ్ ప్రతినిధులు, ఆర్మీ, అధ్యక్షుడితో జరిపిన చర్చల్లో సుశీల కర్కీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆమె చేత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయించారు.
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా యువతి చేపట్టిన ఆందోళనల తర్వాత ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రి వర్గంలో చాలా మంది రాజీనామాలు సమర్పించారు. అయితే, నేపాల్‌కు ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుశీలా కర్కీ ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలిసింది.
అయితే, మాజీ నేపాల్ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఈమె భర్త 52 ఏళ్ల క్రితం విమానం హైజాక్‌కు పాల్పడినట్లు చాలా తక్కువ మందికి తెలుసు. 1973 విమాన హైజాకింగ్‌లో కర్కీ భర్త , నేపాలీ కాంగ్రెస్ మాజీ యువ నేత దుర్గా ప్రసాద్ సుబేది కీలకంగా వ్యవహరించారు.
Sushila Karki: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా జెన్-జెడ్ యువతి చేసిన నిరసనలు నేపాల్‌లో హోరెత్తాయి. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపైకి భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. దీంతో, ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీతో పాటు ఆయన ప్రభుత్వంలో మంత్రులు ఒక్కొక్కరిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం, దేశాన్ని ఆర్మీ తన కంట్రోల్‌కి తీసుకుంది. ఇదిలా ఉంటే, నేపాల్‌కు కాబోయే తదుపరి ప్రధానమంత్రిపై చర్చించడానికి 5000…