సీఎస్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన తరవాత పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇది చాలా బాధాకరమైన రోజు. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం అధికారుల కమిటీ మాటలనే వినింది. ప్రభుత్వం సమాజాన్ని తప్పుదోవ పుట్టిస్తోంది. ఈ నెల పాత జీతాలనే ఇవ్వండి అని కోరినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఇది ఆషామాషీ వ్యవహారం…
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండివైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ పై కీలకంగా చర్చలు జరిగాయి. అన్ని సంఘాలు ఏకాభిప్రాయంతో నిర్ణయానికి వచ్చాయి. సమ్మె నోటీసులో పీఆర్సీ, అనుబంధ అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పొందుపరుస్తామన్నారు. వైద్యారోగ్యశాఖ విషయాలను, అక్కడ వున్న కార్మిక చట్టాలకు అనుగుణంగా సమ్మెకు దిగుతారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు వివరించారు. 7వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి నిరసనకు దిగుతారన్నారు. పాత జీతం ఇవ్వాలని…
ఏపీ జేఎసీ, ఏపీజేఎసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం , సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఏక తాటిపైకి రావాలని నిర్ణయించినట్టు బండి ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చర్చల ద్వారా సంప్రదింపులు చేసుకుని ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్నామన్నారు. పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల ద్వారా నష్టం జరుగుతుందన్నారు. ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మా డిమాండ్లు సాధించుకుంటామన్నారు. సచివాలయంలో…
ఏపీలో పీఆర్సీపై రగడ నడుస్తోంది. కొన్ని నెలలు 11వ పీఆర్సీపై కసరత్తు చేసిన జగన్ సర్కార్ ఎట్టకేలకు పీఆర్సీ ప్రకటించింది. సీఎం జగన్ తో జరిగిన భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు ప్రధాన అంశాలను పరిష్కరించారని వెల్లడించారు. ఆ తరువాత ప్రభుత్వం ప్రకటించిన జీవో ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల వేతనం విషయంలో…
ప్రశాంతంగా ఉన్న ఆ నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరో యువ నాయకుడు కూడా వీరికి జత కలవడంతో హీట్ మరింత పెరిగింది. ఎన్నికలే లేని ఈ సమయంలో అక్కడ ఎందుకంత లొల్లి..? ధర్మవరంలో పొలిటికల్ హీట్..!రాజకీయాల్లో అనంతపురం జిల్లా తీరు కాస్త ఢిఫరెంట్. ఏదో ఒక నియోజకవర్గంలో రగడ కామన్. ఒక్కోసారి తాడిపత్రి.. మరోసారి బాలయ్య ఇలాకా హిందూపురం.. ఇంకోసారి రాప్తాడు. తాజాగా ధర్మవరంలో పొలిటికల్…
గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పీఆర్సీకి సంబంధించి చర్చలు జరుగుతునే ఉన్నాయి. పీఆర్సీ విషయంలో అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు పొత్తు కుదరడం లేదు. దీంతో ఈ అంశం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన చర్చల అంశాలను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర విభజన నుంచి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వరకు అధికారులు మాకు వివరించారన్నారు. ఇక ముందు చర్చలకు…
ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన చెల్లించాలని ఒక చట్టం చేయా లని,జీతాల నుంచి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తొలి బిల్లుగా ఒకటో తేదీకే జీతాల బిల్లును ప్రభు త్వం ప్రతిపాదించాలన్నారు. ఒకటో తేదీనే ఇవ్వకున్నా.. ఎప్పుడో ఒకప్పు డు ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్న మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేయ డం సరైన పద్ధతి కాదని ఆయన…
దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట విషాదం చోటు చేసుకుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు తండ్రి వెలంపల్లి సూర్యనారాయణ (80) గురువారం ఉదయం స్వర్గస్తులయ్యారు. విశాఖపట్నం బ్రాహ్మణ వీధిలో ఆయన తన స్వగృహంలో సూర్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో వెల్లంపల్లి తండ్రి సూర్యనారాయణ మృతి చెందారు. అయితే.. ఆయన మృతికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. తన ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.…