(అక్టోబర్ 28న సూర్యకాంతం జయంతి)తెరపై సూర్యకాంతం కనిపించగానే జనం జడుసుకొనేవారు. ‘గయ్యాళి’ పాత్రల్లో తరచూ కనిపించడం వల్ల ‘గయ్యాళి’ అన్నది సూర్యకాంతంకు పర్యాయపదంగా నిలచింది. ఆ రోజుల్లో తెలుగునాట ‘సూర్యకాంతి’పై అభిమానం ఉన్నవారు సైతం తమ ఆడ పిల్లలకు ‘సూర్యకాంతం’ అన్న పేరు పెట్టడానికి జంకేవారు అంటే, ఆమె అభినయం ఏ స్థాయిలో జనాన్ని జడిపించిందో అర్థం చేసుకోవచ్చు. తెరపై గయ్యాళిగా కనిపించినా, నిజజీవితంలో ఆమె మనసు వెన్నపూస అనేవారు సన్నిహితులు. సూర్యకాంతం అభినయంతో ప్రేక్షకులను అలరించిన…