CM Revanth Reddy: అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దేశంలో కరువు విలయతాండవం చేస్తుంది. ఆనాడు దేశంలో 90శాతం పైగా జనాభా వ్యవసాయం, కులవృత్తులు, చేతి వృత్తుల మీద అధారపడి జీవిస్తున్న క్రమంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పంచవర్ష ప్రణాళిక విధానం తీసుకుని వచ్చారన్నారు. ఇందులో వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చారు. ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారు. రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారు.హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఆనాడు రాజీవ్ గాంధీ పునాదులు వేశారని తెలిపారు. ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మన విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందన్నారు. వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందన్నారు.
Read also: BRS Mlas Protest: సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా.. కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్..
అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేబోతున్నామని తెలిపారు. యంగ్ ఇండియా పత్రిక మహాత్మాగాంధీ మొదలు పెట్టారని తెలిపారు. మహాత్మాగాంధీ స్పూర్తితో యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పించడమే స్కిల్స్ యూనివర్సిటీ ఉద్దేశమన్నారు. స్కిల్స్ యూనివర్సిటీపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు సూచనలు ఇస్తే సంతోషించేవాళ్ళమన్నారు. కానీ వారు సభకు రాలేదు.. వచ్చిన వారు వాకౌట్ చేసి వెళ్లిపోయారన్నారు. స్కిల్స్ 17 కోర్సులను యూనివర్శిటీలో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏడాదికి రూ.50వేలు నామ మాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నాం. అవసరమైతే ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచితంగా అందిస్తామన్నారు. ఇవాళ సాయంత్రం స్కిల్స్ యూనివర్సిటీకి భూమిపూజ చేసుకోబోతున్నామన్నారు. ఈ సంవత్సరం 6కోర్సులకు రెండువేల మందికి అడ్మిషన్స్ కు అవకాశం ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు.
Read also: Collectors Conference: 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వీటిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు..
భవిష్యత్ లో జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనం తప్ప.. ప్రజల ప్రయోజనం పట్టదన్నారు. రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆరెస్ నేతలు ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్స్ యూనివర్సిటీపై చర్చ జరగకూడదని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఆ అక్కలను నేను నా సొంత అక్కలుగానే భావించా… సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు వాళ్లు.. అక్కా మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దు.. మీ ముందు కింద కూర్చో కూడదనే కేసీఆర్ సభకు రావడంలేదన్నారు. కేసీఆర్ కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్.
Read also: CM Revanth Reddy: ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
హరీష్ ను మంత్రి చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. మైక్ ఇస్తే శాపనార్థాలు.. ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. నేను చెల్లెలు జైల్లో ఉంటే రాజకీయాల కోసం బజార్లో తిరిగేవాన్ని కాదన్నారు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారన్నారు. అక్కల క్షేమం కోరే చెబుతున్నా… వాళ్ల ఉచ్చులో పడొద్దన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులతో వాదించేలా కృషి చేశామన్నారు. దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయారని తెలిపారు. అందుకే వాళ్ల నుంచి ఏమైనా ఆశిస్తే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే అన్నారు. వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నామని, సాయంత్రం స్కిల్స్ యూనివర్సిటీ భూమిపూజకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నా అని సీఎం తెలిపారు.
CM Revanth Reddy: ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తాం..