వీధి కుక్కల బెడదపై బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ఇప్పటికే పలు కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం.. తాజాగా మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘‘కుక్క కరిచే మూడ్‌లో ఉన్నప్పుడు దాని మనసును చదవలేరని.. చికిత్స కంటే నివారణే ఉత్తమం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Union Budget: కేంద్ర బడ్జెట్ తేదీపై సందిగ్ధం.. కొత్త అంచనాలు ఇవే!
గతేడాది నవంబర్ 7న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యాసంస్థలు, ఆస్పతులు, రైల్వే స్టేషన్లలో కుక్క కాటులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాల్లో కుక్కల బెడద లేకుండా చూడాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్, టీకాల తర్వాత షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. తిరిగి పట్టుకున్న స్థలాల్లో విడిచి పెట్టొద్దని ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. అలాగే రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నుంచి అన్ని పశువులు, ఇతర వీధి జంతువులను తొలగించేలా చూడాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Haryana: మగ బిడ్డ కోసం ఆరాటం.. 10 మంది కుమార్తెల తర్వాత…!
ఇక గతేడాది జూలైలో కూడా ఇలాంటి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కుక్క కాటు కారణంగా ఒక్క రేబిస్ మరణం జరగకూడదని తెలిపింది. అడ్డుకునేవారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక దాణా స్థలాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోర్టు ఆదేశించింది. బహిరంగంగా ఆహారం ఇవ్వడానికి అనుమతించబడదని.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇదే మాదిరిగా ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది.